సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

సూర్యాపేట, వెలుగు : డిసెంబర్ ఒకటో తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్ ఏఎస్ రావు అవార్డు కౌన్సిల్ టాలెంట్ టెస్ట్ ఫస్ట్ లెవల్లో సూర్యాపేట సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభచాటి లెవల్ --2కు అర్హత సాధించారు. పదో తరగతి నుంచి జి.శ్రీజ రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, ఎస్.సాయిసృజన 9వ ర్యాంకు, ఎస్.సాయిగోకూల్ 10వ ర్యాంకు,  వై.ప్రజ్ఞ 13వ ర్యాంకు, పి.సాయికుమార్ 15వ ర్యాంకు, డి.నందకిశోర్ 16వ ర్యాంకు, బి.ప్రణవి 18వ ర్యాంకు, జి.నితీషావర్ధిని18వ ర్యాంకులు సాధించారు.

9వ తరగతి నుంచి ఎస్.సాన్వి రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు, ఏ.విద్యాచరణ్ 7వ ర్యాంకు, ఆర్.వెంకటసాయి ప్రణవ్ 8వ ర్యాంకు, కె.దేహితారెడ్డి 12వ ర్యాంకు, జి.దినేశ్ కుమార్ 13వ ర్యాంకు, ఆర్.శివాత్మిక 14వ ర్యాంకు,  ఎం.ఆశ్రీత్ రెడ్డి 18వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ప్రకాశ్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.